ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు 65మందికి కరోనా నిర్ధారణ ఐంది.యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో 1500వందల మందికి కరోనా పరీక్షలు చేయగా 65మందికి కరోనా అనితేలింది.
మహిళల హాస్టల్ లో 500మందికి శనివారం కరోనా పరీక్షలు చేస్తే 200మందికి నెగెటివ్ వచ్చింది.మరొక 300మంది విద్యార్థినుల కరోనా రిపోర్ట్ రావాలసి ఉంది.
ఈ సమాచారం అందగానే విశాఖపట్నం జిల్లా DMHO డాక్టర్ సూర్యనారాయణతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తర్వాత మీడియాకు వివరాలందిస్గూ, విశాఖపట్నం జిల్లాలో 6కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని అవి
విశాఖపట్నంలో KGH హాస్పిటల్, అనకాపల్లి,విమ్స్ నర్సీపట్నం, పాడేరు, అరకు హాస్పిటల్స్ అని ఆయన చెప్పారు. ఇందులో కరోనా బాధితుల కోసం 1000బెడ్స్ సిద్ధం చేశారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం KGH హాస్పిటల్ లో 15మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసాం. ప్రతి రోజు ఉదయం అన్ని జిల్లాల DMHO, DCHS, గవర్నమెంట్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ తో కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి సమీక్షిస్తున్నారు.
మార్కెట్లు, వారంతపు సంతలు, ప్రజా రవాణా లో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయలు, ప్రవేశ ప్రాంతంలో తప్పనిసరిగా ధర్మల్ స్కానింగ్, శానిటైజర్ వినియోగించాలని, 65సంవత్సరాలు దాటిన వారు,
ధీర్గ కాలిక వ్యాధులు ఉన్న వారు, గర్భవతులు,10సంవత్సరాలలోపు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పాజిటివ్ తెలిన వ్యక్తిని 14రోజులు ముందు కలిసిన వారిని క్వారంటైన్ లో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.