బయటికి పోయి వచ్చే వారి వల్లే కరోనా ఇళ్లంతా వ్యాపిస్తాంది

(డా అర్జా శ్రీకాంత్)
కరోనా ఉద్ధృతి ఎక్కువవుతోంది పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా 9024 కేసులు నమోదు అయ్యాయి. అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి (1372), కర్నూలు(1138) జిల్లాలో అత్యధిక సంఖ్య నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 244549 కేసులు నమోదయ్యాయి. ఇందులోమ 87597  కేసులుయాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు 2203  మంది చనిపోయారు.
87 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. అత్యధికంగా అనంతపూర్ (13) , చిత్తూరు జిల్లా (12)లో నమోదు అయ్యాయి.
నాకు రాదు అని నిర్లక్ష్యంగా మాస్కులు ధరించ కుండా, భౌతిక దూరం పాటించకుండా ఎప్పటికప్పుడు చేతులు కాళ్లు శుభ్రపరుచు కోకుందా ఉన్నట్లయితే వీధిలోనే ఉన్న కొరోనా ను ఒంటిలోని కి ఇంట్లోని కి తెచ్చుకున్నట్లే.
ప్రస్తుతం ఈ కరోనా బయటికి వెళ్లి వచ్చే వాళ్ల నిర్లక్ష్యం వలన ఇంటిలోని కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందుతోంది.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు.
వెళ్ళినప్పుడు ప్రభుత్వం వారి సూచనలను తప్పక పాటించాలి.
(డాక్టర్ శ్రీకాంత్ ఆర్జా, ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్,
covid 19, ఆంధ్రప్రదేశ్ )