ఈ రోజు సోషల్ మీడియా సెన్సేషన్ ఐఎఎస్ అధికారి రామ్ సింగ్.
2008 బ్యాచ్ కు చెందిన ఈ అధికారి ఇపుడు మేఘాలయ వెస్ట్ గారో హిల్స్ కలెక్టర్ గా ఉంటున్నారు. ఆయన ఇంట్లోకి కాలసిన కూరగాయలను స్వయంగా మార్కెట్ వెళ్లి కొనుక్కుంటారు.
ఇది కాదు అసలు విశేషం.
దీని కోసం ఆయన వారానికొకరోజున పదికిలో మీటర్లు నడిచి తూరా జిల్లా కేంద్రానికి ఆ చివర ఉన్న సంతకు పోయి, స్థానికంగా పండిచిన వాటినే కొంటారు.అదీ కథ.
నిజానికి ఆయనకు చక్కగా కారులో వెళ్ల వచ్చు. కలెక్టర్ అంటే పనివాళ్లకు కొదవవుండదు. చాలా మంది కలెక్టర్లయితే ఆ ప్రాంతంలో ఉన్నఅధికార్లకు చెప్పి తెప్పించుకుంటారు.
లోకల్ కూరగాయలంటే కలెక్టర్ ముచ్చటడపడుతున్నాడని తెలిస్తే, తాహశీల్దార్లే గంపలు గంపలు పంపిస్తారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది.
అయితే, రామ్ సింగ్ కు అదిష్టం లేదు. ఆయన గారో ప్రజల్లాగానే వెదురు గంపలను వీపున వేలాడేసుకుని భార్యతో కలసి సంతకొస్తాడు. ఆయన భార్య కూడా పిల్లవాడిని వీపున తగిలించుకుని ఆయనతో పాటు పదికిలోమీటర్లు నడచుకుంటూ కూరగాయల సంతకొస్తుంది.
కలెక్టర్ ఇలా సంతలో కూరగాయలు కొంటూండటాన్ని ఎవరో వ్యక్తి గుర్తుపటి టకీమనిఫోటో తీసి ఫేస్ బుక్ పోస్టు చేశాడు. ఇది విపరీతంగా పాపులర్ అయింది.దీనిని ఆయన కూడా షేర్ చేశాడు. ‘వారానికి సరిపోయే 21 కేజీల కూరగాయలు కొంటున్నా. ప్లాస్టిక్ లేదు. వాహనాల పొల్యూషన్ లేదు. ట్రాఫిక్ జామ్ లేదు. ఫిట్ ఇండియా, ఫిట్ మేఘాలయ. ఆర్గానిక్ తినండి. క్లీన్ అండ్ గ్రీన్ తూరా. ఫోషణ్. పది కిమీ మార్కింగ్ వాక్ ’ ఆయన షేర్ చేశారు.’
స్థానిక రైతులను ప్రోత్సహించేందుకు తానిలా చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
‘ఇంత బరువు కూరగాయలను మోసుకుని రావడం చాలా కష్టమని నాతో చాలా మంది చెప్పారు. అయితే, లోక్ ల్ వెదురు గంప కోక్ చంగ్ తో మోసుకురావచ్చని, దీనితో ప్లాస్టిక్ ని తగ్గించవచ్చని నేను చెప్పాను. అయితే, వాళ్ల నవ్వి కొట్టి పడేశారు. నేను, నాభార్యతో కలసి ఈ గంప వీపున వేసుకుని బయలుదేరాం. ఇది చాలా విధాల ప్రయోజనకరం,’ అని ఆయన ఒక లోకల్ వెబ్ సైట్ కు చెప్పారు.
రామ్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ చెందిన వాడు. ఇపుడు 2017 డిసెంబర్ 1 న ఆయన వెస్ట్ గారో హిల్స్ డిప్యూటీ కమిషనర్ గా వచ్చారు.