*మన ఆహారంలో జన్యు మార్పిడి (GM) పదార్థాలకు అనుమతి ఇవ్వడాన్ని మీరు ఒప్పుకుంటారా?
బీటీ వంకాయ మరియు GM ఆవాలు, GM మొక్కజొన్న వంటి జన్యు మార్పిడి ఆహారపంటలకు భారతదేశం సాగు అనుమతి లేకుండా కొనసాగడంలో మీరు కీలక పాత్ర పోషించారు. మన ఆహార మరియు వ్యవసాయ వ్యవస్థలలో జన్యుమార్పిడి పంటలు మరియు ఆహారము వద్దని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయం తీసుకున్నాయి. దీనికి కూడా పౌరులుగా మనమందరం కలిసి పోరాడడమే కారణం.
అయితే, జన్యు మార్పిడి పదార్థాలు కలిగిన ఆహారం ఇప్పుడు మన దేశంలో ప్రవేశించే ప్రమాదం వచ్చింది. దీనిపై ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసిన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి ఇప్పుడు కొత్త ముప్పు ఏర్పడింది. ఈ నిబంధనలు చాలా బలహీనంగా ఉన్నాయి మరియు ఈ నిబంధనలను ఖరారు చేసి ఈ పద్ధతిలో అమల్లోకి తెచ్చినట్లయితే మనం GM ఆహారాలతో మునిగిపోతామని స్పష్టమవుతుంది.
*ఈ ముసాయిదా నిబంధనల పై మన సూచనలు ఇవ్వడానికి FSSAI ఇచ్చిన గడువు కేవలం జనవరి 15, 2022 వరకే ఉంది, కాబట్టి మనము తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
మీరు మన ఆహారములో జన్యు మార్పిడి ఆహారాన్ని వ్యతిరేకి స్తుంటే ఈ క్రింది లింక్ ద్వారా మీరు పిటీషన్ పై సంతకం చేయండి..