ఈ రోజుల్లో అందరూ బరువు (obesity) తగ్గే సాధనలో రకరకాల ఆహార ప్రణాళికలను పాటిస్తున్నారు. బరువు అంతర్జాతీయ అందులో భాగంగా కొందరు కేవలం అరటిపండు తిని బరువు తగ్గవచ్చు అని కూడ చెప్తున్నారు. ముఖ్యంగా జపాన్ లో బరువు తగ్గేందకు అరటిని వైద్యం లాగా వాడుతున్నారు. ఇది బ్రేక్ ఫాస్ట్ తో మొదలవుతుంది. హితోషి వతనబే (Hitoshi Watanabe) బరువు తగ్గే విధానంలో ప్రధాన పాత్ర అరటి పండుదే. ఆయన రూపొందించిన Morninb Banana Regimen చాలా పాపులర్ అయింది. చివరకు ఇదొక పుస్తకంగా తయారయింది. ఇది హితోషి పర్సనల్ అనభవం. ఆయన ఆ మధ్య విపరీతంగా లావెక్కారు. దీనికి ఆయన భార్య సుమితో వతనబే (Sumito Watanabe) ఒక చిట్కా కనిపెట్టింది. ఆమె వృత్తిరీత్యా చైనీస్ హెర్బల్ మెడిసిన్ ఫార్మసిస్టు. ఆమె కనిపెట్టిన చిట్కా బనాన డైట్ (Banana diet). ఆమె రూపొందించిన బనానా డెయిట్ ఎంతగా పనిచేసిందంటే ఆరునెలల్లో హితోషి 11 కేజీలు తగ్గారు. తన అనుభవాన్ని ఆయన ఇంటర్నెట్ కమ్యూనిటీకి పరిచయం చేశారు. అంతే, అరటి వైద్యం దావానలంలా అంటుకుంది. జపాన్ లో ప్రజలు విపరీతంగా అరటి వైద్యంమొదలు పెట్టారు. దీనితో అరటి పళ్ల డిమాండ్ దేశంలో 20 శాతం పెరిగింది. సుమితో అరటి వైద్యం లో అరటి బ్రేక్ ఫాస్టు ప్రధానమయింది. అరటిపండును బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే బరువు తగ్గడం ఎలా మొదలవుతుందో ఆమె చూపారు. ఇపుడు ప్రపంచమంతా వెయిట్ లాస్ కోసం జపాన్ అరటి వైపు వైద్యం చూసోంది. ప్రపంచంలో వెయిట్ లాస్ కు ఇంత చవకైన మ్యాజికల్ వైద్యం మరొకటి లేదు. ఇందులో అరటిపళ్లు, ఒక గ్లాస్ గొరువెచ్చని నీళ్లు తప్ప మరొకటి లేదు. డైయిటింగ్ చిత్రహింసకూడా ఉండదు.
Quick and Easy Weight Loss With the Japanese Morning Banana Diet అని ఆ మధ్య NDTV కూడా ఈ వైద్యాన్ని రివ్యూ చేసింది.
అరటి వెయిట్ లాస్ ఎంతవరకు నిజం అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. అరటిపండు మనం బరువు తగ్గడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన ఆకలిని తగ్గించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేలా చేస్తుంది అరటిపండు స్వయంగా బరువు తగ్గించదు గాని, ఇలా బరువు తగ్గేందుకు బాట వేస్తుంది.
ఎక్కడ బడితే అక్కడ, ఎపుడు బడితే అపుడు కనబడే సాదాసీదా అరటిపండును తక్కువ అంచనా వేయకండి. అరటిపండ్లు పొటాషియం, విటమిన్-సి , విటమిన్-బి6, మెగ్నీషియం, కాపర్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి, కాని వాటిని ముఖ్యంగా ఆసక్తికరంగా మార్చడం ఏమిటంటే, వాటి పోషకాలు వాటి పక్వత స్థాయిని బట్టి మారుతుంటాయి.
పూర్తిగా పండని అరటి పండ్లు చాలా నిరోధక పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి, అందువల్ల అరటి పండు తింటూనే కడుపు నిండనట్లవుతుంది. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపు ఖాళీ అయ్యే రేటు తగ్గించడం ద్వారా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది.
ఒక మీడియం అరటిపండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుది.ఒక అరటి పండు తింటే ఒక రోజు మనిషికి అవసరమయ్యే ఫబర్ లో పదిశాతం లభిస్తుంది. అరటి పండులో విటమిన్ ఎ కూడా ఉంది. కళ్లకు క్యారెట్ కాపలా అనే పేరున్నా, విటమిన్ కూడా ఉన్న అరటి పండుకూడా కళ్లకు సంబంధించి ఏమాత్రం తీసి పోదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. నేషనల్ ఇన్ సిట్యూట్ లెక్క ప్రచారం ఒక మధ్య రకం అరడిపండు తింటే 90 క్యాలరీల శక్తి లభిస్తుంది.
యుఎస్డిఎ (USDA-U.S.Department of Agriculture)ప్రకారం, ఇది మీ డివిలో(DV-daily value) 11 శాతం. అలాగే, అరటిపండ్లు పొటాషియంకు ప్రసిద్ధి – ఒక మీడియం అరటిపండు లో 422 మి.గ్రా పొటాషియం ఉంటుందని యుఎస్డిఎ చెబుతుంది, ఇది మీ డివిలో 9 శాతం. మీరు 10 మి.గ్రా విటమిన్ సి ను కూడా పొందుతారు, ఇది మీ డివిలో 11 శాతానికి పైగా ఉంటుంది.
NIH(National Institute of health)ప్రకారం, మీరు మీ రోగనిరోధక వ్యవస్థ మరియు జీవక్రియకు అవసరమైన 0.4 mg విటమిన్ B6 ను ఒక అరటిపండు నుండి పొందవచ్చు.
2017లో వచ్చిన ఒక మెటాఎనాలిసిస్ ప్రకారం దోరగామాగిన ఆకుపచ్చని అరటి కి కూడా అల్సర్ ను, కోలెస్టరాల్ ను, బిపిని తగ్గించేగుణాలున్నాయని తెలిసింది.
ఈ పోషకవిలువలు అన్నీ కలిసి అరటిపండును అద్భుతమైన వనరుగా చేస్తున్నాయి. కాబట్టి ప్రతి రోజు ఒక అరటిపండు తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.
అరటి పళ్లలో సుమారు వేయికి పైగా రకాలున్నాయి. అయితే, ఇందులో క్యావెండిష్ (Cavendish)అనేది బాగా పాపులర్. అరటి పళ్ల ఉత్పత్తిలో ఈ రకమే 45 శాతం ఉంటుంది.