ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని పేరున్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు పై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆయన ఐఎఎస్ అధికారి.
విద్యాశాఖ లో అవినీతి అక్రమాలు, దళిత ఉద్యోగుల పై వేధింపులు,అక్రమ అధికారులకు అండ, జగనన్న విద్యా కిట్ల పంపిణీలో అక్రమాలు అంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణ ను విచారణాధికారిగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఆదేశాలు జారీచేశారు.
చినవీరభద్రుడు బాగా పేరున్న సాహితీ వేత్త. సాహిత్య ప్రపచంలో ఆయనకు అభిమానులు ఎక్కువ.మంచి భాషాలో కథలు,విమర్శలుచేసి బాగా పేరు ప్రఖ్యాతి గడించారు. అయితే, ఆయన జగన్మోహన్ రెడ్డిని బాగా అభిమానిస్తారు.ఇంతవరకు జగన్ మీద అంత గొప్పగా ప్రశంసించిన వాళ్లెవరూలేరు. ప్రభుత్వాలు మంచి ‘సంక్షేమ కార్యక్రమాలు’ ప్రారంభిస్తాయి. అయితే ప్రారంభాలు పండగ ల్లాగా జరుగుతాయి. జగనన్న విద్యాకానుక ఆయనను ఎంతగానో కదిలించింది. ఈ కార్యక్రమం చూసి భావోద్వేగానికి గురై ఫేస్ బుక్ లో ఒక గొప్ప దానిని అక్షరీకరించారు.
అది, “బడికెళ్లే తొలిరోజునే అన్ని పుస్తకాలు, బ్యాగూ… ఈ కల ఎన్నాళ్లకు నెరవేరింది!” అని ఆయన రాశారు. మీరూ కింది లింక్ మీద క్లిక్ చేసి చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/jagananna-vidya-kanuka-a-long-cherished-dream-realized-vadrevu-china-veerabhadrudu/
ఇపుడు ఇలాంటి చినవీరభద్రుడి పై సీఎంవో, సీఎస్ అదిత్యనాధ్ దాస్ కు కర్నూల్ జిల్లాకు చెందిన తేనె సాయిబాబా ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వృత్తి పరంగా చినవీరభద్రుడికి ఎక్కడా మచ్చలేదు. మంచి పేరుంది. ఆయన మీద అవినీతి ఆరోపణలంటే విశ్వసించడం కష్టం.ఆయన తాత్విక ప్రపంచం వేరు, సాహిత్యం, ఫిలాసఫీ వంటి అంశాలుంటాయి తప్ప, సంపాదన పరుడు కాదు. అయితే, ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఆయన మీద విచారణకు ఆదేశించారేమో.
https://trendingtelugunews.com/featured/writer-vadrevu-chinaveerabhadrudu-ntr-telugu-award/