భారత్ తొందరగా కోలుకోవాలని కోరుతున్నపేద దేశాలు, ఎందుకో తెలుసా;

ఇండియా బాధపడితే ప్రపంచం నష్టపోతుందని ఇపుడు దేశంలో చెలరేగుతున్న కోవిడ్ సంక్షోభం చెబుతున్నది. ఇది రెండు రకాలు ఒకటి, ఇండియాలో ఉన్న వైరస్ వేరియాంట్ విదేశాలకు చేరుకోవడం. రెండు ఇండియా నుంచి వస్తున్న వ్యాక్సిన్ సరఫరా ఆగిపోవడం.

భారతదేశం అనేక పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తూ ఉండింది. మార్చి నుంచి దేశంలో కోవిడ్ కేసులు పెరగడంతో  విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా నినిలిపివేసింది.ఈ దేశాలన్నీ ఇపుడు భారతదేశం  వ్యాక్సిన్ సరఫరాను ఎపుడు పునరుద్ధరిస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాయని గ్లోబల్ వ్యాక్సిన్ ఎలయన్స్ (Global Vaccine Alliance: Gavi)పేర్కొంది.  ఈ సంస్థ కూడా ఈ వ్యాక్సిన్ పంపక కార్యక్రమంలో భాగస్వామి. అంటే, భారత్  కోవిడ్ సమస్య తొందరగా పరిష్కారం కాకపోతే,   భారత్ నుంచి వ్యాక్సిన్ పొందినదేశాలన్నీంటా వ్యాక్సిన్ కార్యక్రమం సంక్షోభం లో పడిపోతుందని బిబిసి రాసింది.

అయితే, కనుచూపు మేరలో అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితి మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. వైరస్ దేశాలన్నింటిని చిన్నాభిన్నం చేస్తున్నది. భారత్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

భారతదేశం నుంచి మొత్తంగా 93 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా జరిగింది. భారత్ హామీ తోఈ దేశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలయింది. దేశీయంగా డిమాండ్ పెరగడం, కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో భారత్ ఎగుమతులు నిలిపివేయడంతో అక్కడి వ్యాక్సి నేషన్ కార్యక్రమం దాదాపు ఆగిపోయింది.

ఇండియా కరోనావైరస్ వేరియాంట్

వైరస్ లు ఎపుడూ రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఏ రూపంలో తమకు ఏది అడ్డురాదో ఆరూపంలో స్థిరపడతాయి.  అడ్డొస్తే మరొక రూపంలో మ్యటేషన్ చెందుతాయి. ఇలా ఇండియాలో వైరస్ ప్రస్తుతం మ్యూటషన్ ల తర్వాత B.1.617 రూపంలో వ్యాపిస్తూ ఉంది. దీనికి ఇండియా వేరియాంట్ అని కూడా పేరొచ్చింది.

GISAID (Global Influenza Surveillance And Response System)  డేటా బేస్ ప్రకారం ఇప్పటికి ఈ వేరియాంట్ 21 దేశాలలో కనిపించింది. అక్టోబర్ నుంచి చాలా దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగినందున ఈ ఈ B.1.617 వేరియాంట్  దేశాలు సరిహద్దులు దాటడం మొదలయింద. ఇంగ్లండులో  ఫిబ్రవరి 22 నాటికే 103 కేసులు కనిపించాయి. ఈవేరియాంట్ కేసులు అనేక దేశాలలో కనిపిస్తూ ఉండటంతో   భారత్ కు విమాన సర్వీసులు రద్దుచేసుకుంటున్నాయి. ఇంగ్లండు ఈ వేరియాంట్ ని ఇంకా ఆందోళనకరమయిన వేరియాంట్ (Variant of concern)గా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశీలనలో ఉన్న(Variant under investigation)క్యాటగరిలో నే ఉంది.

ఇండియా వేరియాంట్  బలంగా సోకే రకమా , వ్యాక్సిన్ లకు లొంగని రకమా అనేది పూర్తిగా తెలియడం లేదు. అయితే, మేడియన్ఇండియా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ ఈ వేరియాంట్ మీద కూడా పనిచేస్తుందని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు వైద్యసలహాదారు డాక్టర్ ఆంధోని ఫాసి కోవాగ్జిన్ కు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆయన దీనిని కోవిడ్ కు సరైన విరుగుడు (Antidote)అని ప్రకటించారు.

అయితే లూయిసియానా యూనివర్శిటీకి చెందిన వైరాలజిస్టు డాక్టర్ జెరెమీ కామిల్  మాత్రం ఇండియా వేరియాంట్ కంటే యుకె వేరియాంట్ చాలా శక్తివంతమయింది,ప్రమాదకరమయిందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *