(యనమల రామకృష్ణుడు)
గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల నేడు ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చిందన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన అబద్ధం మాత్రమే.
కరోనా వల్ల రాబడులు తగ్గాయనేది కూడా వాస్తవం కాదు. కరోనా కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం కన్నా నేడే ఎక్కువ రెవెన్యు రాబడులు వచ్చాయనేది అక్షరసత్యం. 60 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేసి అనేక అభివృద్ధి పథకాలు చేసింది.
20 నెలల్లో జగన్ రెడ్డి రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసి కూడా అభివృద్ధి ఏమీ చేయలేకపోయారు. సంక్షేమం కూడా చంద్రబాబు ప్రభుత్వం కన్నా ఎక్కువేమీ చేయలేదు. రైతు రుణమాఫీ రద్దు, నిరుద్యోగ భృతి రద్దు, అన్న క్యాంటీన్ల రద్దు, చంద్రన్న బీమా రద్దు, పండుగ కానుకలు రద్దు, విదేశీ విద్య రద్దు లాంటి 34 సంక్షేమ పథకాలు రద్దు చేశారు.
అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి ‘నాన్నబుడ్డి’ ద్వారా ఏడాదికి రూ.36 వేలు గుంజుకుంటున్నారు. వాహనమిత్రకు రూ.10 వేలు ఇచ్చి జరిమానాల పేరుతో డీజిల్ రేట్లు పెంచి రూ.30 వేలు కొట్టేస్తున్నారు. సెంటు పట్టా పేరుతో రూ.6500 కోట్లు అవినీతి చేశారు. వైసీపీ సంక్షేమం మోసకారి సంక్షమమే. కంటికి తెలియకుండా కాటుక కొట్టివేయడమే. 20 నెలల్లో తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, ధరల వల్ల ఒక్కో కుటుంబంపై రూ.2.5 లక్షల రూపాయల భారం మోపారు.
ప్రభుత్వ నిధులు, సహజ వనరుల దోపిడీతో లక్ష కోట్లు జగన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు మేసివేశారు. ఈ మితిమీరిన అవినీతి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. అప్పులు తీర్చడానికి ఆస్తి పన్ను పెంపుతో పాటు ఇతరత్రా ఎడాపెడా పన్నులు, ధరలు పెంచుతున్నారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అప్పులు
1. 2019-20లో చేసిన అప్పులు (బడ్జెటరీ అప్పులు) రూ.46,503.21 కోట్లు
2. 2020-21లో జనవరి వరకు చేసిన అప్పులు రూ.73,912.91 కోట్లు
3. వివిధ కార్పొరేషన్ల అప్పులు 20 నెలల్లో (బడ్జట్ యేతర) రూ. 34,650.00 కోట్లు)
4.20 నెలల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,55,066.12 కోట్లు
(ఆధారం: కాగ్ రిపోర్ట్ మరియు STC డాక్యుమెంట్స్)
చంద్రబాబు ప్రభుత్వం 60 నెలల్లో చేసిన అప్పు
(ఆధారం: RTI, Letter No.Fin 01-Bugt/7/2020 C&DM)
1. 2014-15లో చేసిన అప్పు రూ.18,089.11 కోట్లు
2. 2015-16లో చేసిన అప్పు రూ.25,110.15 కోట్లు
3. 2016-17లో చేసిన అప్పు రూ.23,599.96 కోట్లు
4. 2017-18లో చేసిన అప్పు రూ.25,064.93 కోట్లు
5. 2018-19లో చేసిన అప్పు రూ.38,282.83 కోట్లు
మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పు రూ.1,30,146.98 కోట్లు
వివిధ రాష్ట్రాలు 2020-21 జనవరి వరకు చేసిన అప్పులు
క.స రాష్ట్రం 2020-21 (అప్పులు) 2020-21 రెవెన్యూ రాబడులు
1 ఆంధ్రప్రదేశ్ రూ.73,912 కోట్లు రు 88,238 (జనవరి వరకు)
2 తెలంగాణ రూ.43,930 కోట్లు రూ.74,990 కోట్లు
3 తమిళనాడు రూ.49,844 కోట్లు రూ.1,27,748 కోట్లు
4 కేరళ రూ.37,798 కోట్లు రూ.70,578 కోట్లు
5 కర్ణాటక రూ. 30,229 కోట్లు రూ.1,19,090 కోట్లు
6 మహారాష్ట్ర రూ. 35,725 కోట్లు –
7 ఒడిస్సా రూ.3,425 కోట్లు రూ.75,452 కోట్లు
8 ఉత్తరప్రదేశ్ రూ. 28,653 కోట్లు –
9 రాజస్థాన్ రూ. 44,708 రూ.98,481 కోట్లు
ఏపీ ప్రభుత్వ రెవెన్యూ రాబడులు
1. 2018-19 రూ.74,912 కోట్లు (చంద్రబాబు ప్రభుత్వ హయాంలో)
2. 2019-20 రూ.85,987 కోట్లు (జగన్ ప్రభుత్వ హయాంలో
3. 2020-21 రూ.88,238 కోట్లు (జనవరి వరకు)
(యనమల రామకృష్ణుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు,
శాసనమండలి టీడీపీ పక్షనేత)