మీ ఇంట్లో ప్లేట్ మీల్స్ కు ఎంత ఖర్చవుతుంది?

దేశంలో గత అయిదేండ్లలో కాలంలో భోజనాని కయ్యే ఖర్చు (  మీల్స్ ప్లేట్ ఎకనమిక్స్ లేదా థాలి నామిక్స్ ) బాగా తగ్గిందని, దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కారణమని ఎకనమిక్ సర్వే (2021) వెల్లడించింది.   2015-16 నుంచి అయిదుగురు సభ్యులున్న కుటుంబాలు వెజిటేరియన్ , నాన్ వెజిటేరియన్ భోజనాల మీద చేస్తున్న ఖర్చు బాగా తగ్గింది. కాకపోతే, భోజనానికి వాడే రెండు దినుసుల ధరలు పెరగడంతో 2019లో ప్లేట్ మీల్స్ ధర కొద్దిగా పెరిగింది.

పార్లమెంటుకు సమర్పించిన ఎకనమిక్ సర్వే ప్లేట్ మీల్స్ గురించిన  కొన్ని ఆసక్తికరమయిన, నమ్మలేని విషయాలను వెల్లడించింది. అయిదుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రెండుపూటల ప్లేట్ మీల్స్  తయారు చేసుకునేందుకు ఎంత ఖర్చవుతుంది. వంట దినుసులు, వండేందుకు అవసరమయిన ఇంధనం, లేబర్ చార్జెస్ కలిసి ఈ సారి ఎకనమిక్ సర్వే ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసింది. మీల్స్ ప్లేట్  ఎకనమిక్స్ ద్వారా దేశం ఎంత పురోగతి చెందిందో లెక్కించేందుకు ఈ సారి ఎకనమిక్ సర్వేప్రయత్నించింది.

2019-20 ఇలా ఇంట్లో తయారు చేసుకున్న భోజనానికి అయ్యే ఖర్చును 2006-07 నాడు అయిన ఖర్చుతో పోల్సి, దేశంలో ప్రజల దగ్గిర డబ్బులు పెరిగాయని, భోజనం కొనుగోలు శక్తి   2015-16 నుంచి పెరుగుతూ ఉందని సర్వే లెక్క గట్టింది. దీనికి థాలినామిక్స్ (Thalinomics) అని పేరు పెట్టారు.

“As food is a necessity, a rapid rise in the price of a Thali has the most direct and conspicuous effect on the common man,” అని ఈ థాలినామిక్స్ లో పేర్కొన్నారు.

credits :Lior shapira @unsplash

భారతదేశం ఆర్థిక సౌభాగ్యం లెక్కించేందుకు అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ థాలి భోజనానికి అయ్యే ఖర్చును పరిగణన లోనికి తీసుకున్నారు. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ భోజనాలను పొందగలిగే శక్తి పెరిగేందుకు కారణం,  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్  (ప్రధాన మంత్రి అన్నదాత అయ్ సంరక్షణ అభియాన్, ప్రధాన మంత్రి  కృషి సించాయి అభియాన్) అని సర్వేలో పేర్కొన్నారు.

భారతదేశంలో మీల్స్ ప్లేటు ధర జూన్ 2020-నవంబర్ 2020 మధ్య విపరీతంగా పెరిగిందని, డిసెంబర్ లో బాగా తగ్గిందని  సర్వే చెప్పింది. దీనికి కారణం , డిసెంబర్ నెలలో నిత్యావసర వస్తువుల ధరలు పడిపోవడమే కారణమని సర్వే తేల్చింది.   సర్వే నివేదికను భారత చీఫ్ ఎకానమిస్టు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తయారు చేశారు.

కేంద్ర ఆర్థిక  శాఖ ప్రతి యేటా ఈ సర్వే ని నిర్వహిస్తుంది.  పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందరోజున ఈ సర్వేని  పార్లమెంటుకి సమర్పిస్తారు.

దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా మీల్స్ ప్లేట్ ధర ఉందని సర్వే గ్రహించింది. గ్రామీణ ప్రాంతాలలకు సంబంధించి థాలీ రేట్లిలా ఉన్నాయి.

2020-21 సంవత్సరంలో ( జూన్ –డిసెంబర్ మధ్య) వెజిటేరియన్ ప్లే ట్ మీల్స్  అండమాన్ నికోబార్ దీవుల్లో ఖరీదు ఎక్కువ. అక్కడ ప్లేట్ మీల్స్ ధర రు. 38.70 లు.  ఉత్తర ప్రదేశ్లో మీల్స్ ప్లేట్  ధర బాగా  చీప్. ఇది కేవలం  రు.23.10 మాత్రమే.

ఇక నాన్ వెజిటేరియన్ థాలీ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ ప్లేట్  మీల్స్ బాగా ఖరీదు. అది రు. 48.50.  చండీగడ్ లో నాన్ వెజిటేరియన్ థాలి బాగా చౌక. అది కేవలం రు.29.90.

ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే, అండమాన్ నికోబార్ దీవులు వెజిటేరియన్ థాలీ బాగా కాస్ట్లీ. అక్కడ ధర రు.40. ఇక చీపెస్ట్ వెజిటేరియన్ మీల్స్ ప్లేట్  మధ్య ప్రదేశ్ లో కనిపిస్తుంది. అది కేవలం రు. 24 మాత్రమే. ఇక పట్టణ ప్రాంతాల నాన్ వెజిటేరియన్ ప్లేట్ మీల్స్ గురించి మాట్లాడుకుంటే మిజోరాంలో  బాగా బాగా ఖరీదు. అక్కడ హోం మేడ్ ప్లేట్ మీల్స్ ధర రు. 52.40.  హర్యానా పట్టణ ప్రాంతాలలో నాన్ వెజిటేరియన్ మీల్స్ ప్లేట్ 28. ఇదే దేశంలో చీపెస్టు.

2006-07 నుంచి 2019-20 మధ్య మీల్స్ ప్లేట్ కొనుగోలు శక్తి వెజిటేరియన్ కు సంబంధించి 29 శాతం,నాన్ వెజిటేరియన్ కు సంబంధించి 18 శాతం పెరిగిందని ఎకనమిక్ సర్వే పేర్కొంది.

చాలా మంది ప్రజలు నిత్యజీవితంలో మీల్స్ ప్లేట్ ఆధారపడి ఉంటారు కాబట్టి, ఎకనమిక్ ప్లేట్ మీల్స్ ధరని, ప్రజలకనుగోలు శక్తి పరిగణనలోకి తీసుకుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్  మీల్స్ ప్లేట్ లో జార్ఖండ్ రేట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అయిదుగురు సభ్యులున్నా కుటుంబానికి ఒక రోజు మీల్స్ కోసం దినసరి వేతనంలో జార్ఖండ్ లో 25 శాతం ఖర్చవుతుంది.

ఈ సర్వే ప్రకారం దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాలలో ఒక ప్లేట్ మీల్స్ ధర 2015-16 నుంచి తగ్గింది. అయితే ఇదే 2019లో పెరిగింది.

(“Both across India and the four regions-North, South, East, and West- we find that the absolute prices of a vegetarian thali have decreased since 2015-16 though it increased during 2019. This is owing to significant moderation in the prices of vegetables and dal from 2015-16 when compared to the previous trend of increasing prices.”)

సర్వే లో తేల్చిన ఆసక్తికరమయిన విషయం

2006-07లో ఆర్గనైజ్డ్  మాన్యఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పనిచేసే సగటు ఉద్యోగి  రెండు పూటల బోజనానికి  తన జీతంలో  70 శాతం నెలసరి ఖర్చు చేయాల్సి వచ్చింది. 2019 నాటికి ఇది 50 శాతానికి తగ్గింది. నాన్ వెజిటేరియన్ థాలీకి సంబంధించి 2006-07 మధ్య ప్రజలు జీతంలో 93 శాతం ఖర్చు చేసే వాళ్లు.  ఇది 2019 నాటికి  79 శాతానికి పడిపోయింది. ( ఈ లెక్కలను 2017-18 నాటికి అందుబాటులో ఉన్న యాన్యువల్ సర్వే అఫ్ ఇండస్ట్రియల్ డేటాలోని దినసరి కూలి ఆధారంగా తయారు చేశారు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *