ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిఎన్ ఎ (DNA)గొడవ మొదలయింది. నిన్న ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ మీద తీవ్రమయిన విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సలహాదారు సజ్జల రామకృ్ష్ణారెడ్డి డిఎన్ఎ ప్రస్తావన తీసుకు వచ్చారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రమేష్ కుమార్ డిఎన్ ఎ ఒకటేనని అన్నారు. దీని అర్థం సజ్జలకు తెలుసో లేదో దీనిని ఈ రోజు తెలుగుదేశం చాలా సిరియస్ గా తీసుకుని కౌంటర్ ఇచ్చింది.
సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ అబ్బ వైఎస్ రాజారెడ్డి డిఎన్ఏ ఒకటేనా? అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వీడియోల మరిన్ని వివరాలు
చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీఎన్ఏ ఒక్కటే అంటూ వ్యాఖ్యానించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన డిఎన్ఏ ఎవరిదో చెప్పాలని టిడిపి ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సజ్జల మాటల తీరుచూస్తే ఆయనది వైఎస్ రాజారెడ్డిది ఒకటే డిఎన్ఏ అనిపిస్తోందని సుధాకర్ రెడ్డి అన్నారు
అధికారులు, ప్రతిపక్షనేతలకు కులాలు, డిఎన్ఏలు అంటగట్టే నీచ సంప్రదాయం వైకాపా నేతలకు మంచిది కాదని హితవు పలికారు.
రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తున్న ఎస్ఈసీ ప్రభుత్వం నిర్ణయాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సజ్జల చెప్పడాన్ని తప్పు పట్టారు. చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామని, ఎన్నికల విధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించడం ఆయన కుటిలత్వానికి తార్కాణమని అన్నారు.
నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండటం రాష్ట్ర కర్మ అంటున్న సజ్జలలాంటి బుద్ధి హీనులు ప్రభుత్వ సలహాదారుగా వుండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నారు.
ఇలాంటి పనకి మాలిన సలహాదారులు ఉండటం వల్లే ప్రభుత్వం సకాలంలో కొత్త ఓటర్ల జాబితా రూపొందిచ లేకపోయిందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన మూడు లక్షల అరవై వేల మంది ఓటు హక్కు కోల్పోయారని తెలిపారు.
తెలివితక్కువ దద్దమ్మలు, మొండితనం మూర్తీభవించిన వారు సలహా దారులుగా ఉండటం వల్లే సిఎం జగన్ పిచ్చి తుగ్లగ్ లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రతి నిర్ణయానికి కోర్టుల్లో మొట్టికాయలు వేయించుకోవలసి వస్తున్నదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం వల్లే మంత్రులు, సలహాదారులు అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైకాపా నేతలు గ్రామాలలోకి వెలితే పంచలు ఊడదీసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రామతీర్థంలో విజయసాయి రెడ్డిపై ప్రజలు చెప్పులు వేసినా వైకాపా నేతలకు జ్జానోదయం కాకపోవడం దురదృష్టమని చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలకు తపిస్తే భంగపాటు తప్పదని సుధాకర్ రెడ్డి
హెచ్చరించారు.
https://trendingtelugunews.com/top-stories/breaking/ap-government-advisor-declares-all-out-war-on-sec-nimmagadda-ramesh-kumar/