కొత్త పీఆర్పీ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కానుకగా పిఆర్ సి ప్రతిపాదనలు ఉంటాయనుకుని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఉద్యోగులను నిరాశకు గురి చేసిందని చెబుతూ ఈ ప్రతిపాదనలను తాను తిరస్కరిస్తున్నానని రేవంత్ అన్నారు.
2021లో జీవితం, ధరలు ఎలా ఉన్నాయన్న విషయం విస్మరించి పీఆర్పీ 2013 ధరల ప్రకారం పిఆర్ సి ప్రతిపాదనలు రూపందించి ఉద్యోగుల కడుపుకొట్టిందని ఆయన విమర్శించారు.
కేవలం 7.5 శాతం ఫిట్ మింట్ ప్రతిపాదించడం తీవ్ర దిగ్భ్రింతిని కల్గించిందని, తెలింగాణ నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన తొలి పీఆర్సీ ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేదు. నివేదిక రూపకల్పనపైనే అనుమానం కలుగుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ఉద్యోగ జీత భత్యాలు పెంచేందుకు ఒక శాస్త్రీయ అధ్యయనం జరిగన దాఖలాలు లేవు. పీఆర్పీని మూడేళ్లు పెండింగ్ లో పెట్టారు
నివేదిక వచ్చిన తరువాత త్రిసభ్య కమిటీ పేరుతో నెల రోజులుగా కాలయాపన చేశారు.
ఇపుడ, ఇంత కాలయాపన, ఎదురుచూపుల తర్వాత చావు కబురు చల్లగా చెప్పీనట్టు 7.5 శాతం ప్రతిపాదిించడం ఘోరం. ఇది ఉద్యోగులను అవమానించడమే
1974లోనే అప్పటి ప్రభుత్వం 7.5 శాతం ఫిట్ మెంట్ ప్రకటిించింది. ఇపుడు అరశతాబ్దం తర్వాత కూడా అదే పద్ధతా?
దాదాపు అర్ధ శతాబ్దం ధరలు జీవన వ్యయం కొన్ని వందల రేట్లు పెరగగా 7.5 శాతం ఫిట్మెంట్ ఏ మూలకు చాలుతుంది
ఇప్పుడుప్రకటిించబోయే పీఆర్పీ మరో ఐదేళ్లు అమలులో ఉంటుందన్న స్పృహ ప్రభుత్వానికిఉిందా? ఈ పీఆర్పీ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఉద్యోగుల డిమాండ్ మేరకు పీఆర్పీ ఇవ్వాలి
కనీసం 43 శాతానికి తగ్గకుండా పీఆర్పీ ఇవ్వాలి