విశ్వవిఖ్యాత రచయిత రష్యన్ రచయి లియో టాల్ స్టాయ్ అభిమానులు నోబెల్ ప్రైజ్ విషయంలో రెండు సార్లు నిరాశకు గురయ్యారు. ఒక సారి వాళ్లని నిరుత్సాహ పరిచింది నోబెల్ కమిటీ అయితే, రెండోసారి టాల్ స్టాయే వాళ్లని అసంతృప్తికి గురి చేశాడు. ఎలాగ్ో చూడండి.
1901 లో మొదటి నోబెల్ ప్రైజ్ ప్రకటన లీయో టాల్ స్టోయ్ అభిమానులను నిరుత్సాహపరిచింది. అప్పటికే ప్రపంచంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాల రచయితా గాఉన్న టాల్ స్టోయ్ పేరు నోబెల్ అవార్డుకు ఎంపికయిన వారి జాబితాలో ఆయన పేరు లేదు.
ఆయన ఏడాది సాహిత్యంలో నో బెల్ బహుమానం టాల్ స్టోయ్ కి కాకుండా ఫ్రెంచ్ కవి రీనే సిలీ ప్రుదామ్మి (René Francois Armand Prudhomme)కి వచ్చింది.
టాల్ స్టోయ్ అభిమానులకు రెండో సారి నిరాశలో 1906 లో ఎదురయింది.
1906లో నోబెల్ కమిటీ సాహిత్య బహుమతికి టాల్ స్టోయ్ పేరు ప్రతిపాదించింది. ఈ విషయం బయటకు పొక్కింది. తన పేరును బహుమతి (అపుడు లక్ష డాలర్లు) కి ప్రతిపాదించారనే విషయం తెలియగానే ఆయన ఇబ్బంది పడ్డారు. ఆయన వెంటనే నోబెల్ కమిటీకి ఒక లేఖ రాస్తూ ‘దయచేసి నాపేరు జాబితా నుంచి తొలిగించండి,’ అని కోరాడు. ఆలా ఆయన అవార్డు తిరస్కరించి అభిమానులను అసంతృప్తికి గురి చేశాడు.
టాల్ స్టోయ్ ఎందుకలా నోబెల్ బహుమతిని తిరస్కరించాడు.
“దీని వల్ల అంత డబ్బు ను దాచుకోవడమెలాగ అనే యాతన తప్పింది. ఎందుకంటే, అంతడబ్బు దగ్గరంటే వూరికే కష్టాలపాలవుతాం,”అనేది ఆయన సమాధానం.
మరొక విషయం, తను రాసిన పుస్తకాలు ప్రపంచమంతా హాట్ కేక్స్ లాగా సేల్ అవుతున్నా, ఆయన కాపిరైట్ కూడాతీసుకోలేదు.