అయ్యోరామా!! నాకసలు గుర్తుకే లేదు, అసలు అలా ఎలా మర్చిపోయాను!!? ఈమధ్య నాకసలు ఏమీ గుర్తుండట్లేదు… ఇలాంటి మాటలు నిత్యం వింటూ, అంటూ ఉంటాం కదూ…! కానీ ఇది తింటే ఆ అవసరం ఉండదట. ఇది అంటే ఏదో కాదులెండి. మన పెరట్లోనో, ఫ్రిడ్జిలోనో రోజు చూస్తూనే ఉంటాం. అదేనండీ కొత్తిమీర!!
# కొతిమీరలో అధికంగా లభించే విటమిన్ “కే” (vitamin k) వయసు మళ్ళిన తర్వాత వచ్చే మతి మరుపు వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
-> మెదడు చురుకుగా పనిచేయటంలోనూ కొత్తిమీర (coriander) పని తీరు మెరుగే!!
# కొత్తిమీర చాలా యాంటీఆక్సిడెంట్స్ (anti oxidents) ను కలిగి ఉంటుంది. హానికర కొవ్వు పదార్ధాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాల స్థాయిని పెంచుతుంది.
#కొతిమీరలో అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ “ఏ”, విటమిన్ “బి”, విటమిన్ “సి”, విటమిన్ “కే”, భాస్వరం, కాల్షియమ్, ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి.
# కొతిమీరలో లభించే ఖనిజాలు కాళ్ళ ఒత్తిడికి, కండ్ల కలక, దృష్టి లోపం, కంటి వృధాప్యం వంటి వాటి నివారణకు సహాయకారిగా ఉంటుంది.
-> కొత్తిమీర ఆకులను తీసుకుని వాటిని నలిపి నీటిలో వేసి కాచి శుభ్రమైన వస్త్రంతో వడకట్టాలి. ఆ ద్రవంను కొన్ని చుక్కలు తీసుకుని కంటి మీద రాస్తే నీరు కారటం, కంటి దురద, నొప్పి తగ్గుతాయి.
# అనీమియాతో బాధపడేవారు కొత్తిమీరను రోజు ఆహారంలో చేర్చుకుంటే మేలు ఎందుకంటే కొతిమీరలో అనీమియాను తగ్గించే లక్షణం ఉంది.
# కొతిమీరలోని ఆమ్లాలు రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించటంలో ప్రభావవంతం గా పని చేస్తాయి. ఆ విధంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
# కిడ్నీలో రాళ్లు ఉన్నవారు విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కొత్తిమీరను రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు తగ్గటమే కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తుంది.
# కొత్తిమీరలో ఉన్న ముఖ్యమైన నూనె క్రిమి నాశకంగా పని చేస్తుంది. నోటిలోని గాయాలను, హీన స్థితిలో ఉన్న పూతలను నిరోధిస్తుంది.
# కొత్తిమీర వలన చర్మంపై ఏర్పడే ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు, మొటిమలు కూడా దూరం అవుతాయి.