తన రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి రాజకీయ ప్రకటన చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాడా లేదా చెప్పలేదు. వంగవీటి రాధాకృష్ణ నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు కృష్ణా జిల్ల పెనమలూరు నియోజక వర్గం ఉయ్యూరు మండలం కాటూరు లో వంగవీటి రాధా రంగా స్మరణ భూమి పూజ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమం వేదిక మీద నుంచి వంగవీటి రాధాకృష్ణ ఒక సంచలన రాజకీయ ప్రకటన చేస్తారని,అది విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఆయన అభిమానులు భావించారు. అయితే, జరిగింది పూర్తిగా దీనికి భిన్నం.
కార్యక్రమంలో వంగవీటి రత్నకుమారి, రాధ కృష్ణ, కొడాలి నాని పాల్గొన్నారు. అక్కడ రాధ చేసిన ప్రసంగాంశాలు క్లుప్తంగా…
నాన్న కులమతాలకు అతీతంగా పనిచేశారు. కొంత మంది కుట్ర చేసి చంపేసినా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారు. రంగా పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవాకార్యక్రమాలు చేస్తున్నారు .రంగా గారు చనిపోయి డిసెంబర్ 26 నాటికి 30 సంవత్సరాలు అవుతుంది.రంగా చనిపోయే నాటికి నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నాను.ఉద్యమాల పురిటి గడ్డ లో స్మరణ భూమి ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయించాం… అంతే…
ఏవిధమైన రాజకీయ ప్రకటన లేకుండానే వంగవీటి రాధాకృష్ణ కార్యక్రమం ముగిసింది.