అరవింద్ సమేత వీర రాఘవ
రచన – దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
తారాగణం : ఎన్టీఆర్, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, సునీల్, జగపతిబాబు, రావురమేష్, నాగబాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్ తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : పిఎస్. వినోద్
బ్యానర్ : హారిక అండ్ హాసినీ క్రియేషన్స్
నిర్మాత : ఎస్. రాధాకృష్ణ
విడుదల : అక్టోబర్ 11, 2018
రేటింగ్ 3/ 5
త్రివిక్రమ్ మార్కు ఫ్యాక్షన్ సినిమా “అరవింద…”. మొదటిసారి ఒక ఫ్యాక్షన్ నేపథ్యాన్ని పూర్తిగా చూపించిన సినిమా ఇది. త్రివిక్రమ్ మార్కు పంచ్ డైలాగులు ఎక్కువగా లేకపోయినా, సినిమా మధ్యలో యాక్షన్ లో వదిలేసి ప్రేమ వైపు మళ్ళినా , పర్వాలేదు, చూడొచ్చు,బానే ఉంది అన్న స్థాయికి సినిమాను తీసుకెళ్లడంలో త్రివిక్రమ్ టీం మొత్తం కష్టపడి చేసిన పరిశోధన స్పష్టంగా కనబడుతుంది. సినిమాలో మొదటి ఫైట్ ఎన్టీఆర్ స్టామినాను, “6″ ప్యాక్స్ ను , రాం లక్ష్మణ్ క్రియేటివిటీని, ఫ్యాక్షన్ వికృత రూపాన్ని చూపించింది. ఇది ఫ్యాన్స్ కు కన్నుల పండగే!
ఇంతవరకు వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో కన్నా ఇది కొంచెం మెరుగైన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక మధ్యమధ్యలో త్రివిక్రమ్ మార్కు పిక్చరైజేషన్, లొకేషన్లు, డైలాగులు, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ సినిమాకు బలం ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటన గురించి చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎన్టీఆర్ ఎలాంటి నటుడో చూపించింది. ముఖ్యంగా విషాద సన్నివేశాల్లో! క్లైమాక్స్ సినిమాటిక్ (తప్పదు) గా ఉన్నప్పటికి ఫ్యాన్సుకి నచ్చటం ఖాయం!
కమర్షియల్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా ఫ్యాక్షన్ పుట్టుక, దాని నడక, పరిణామాలు బాగానే చర్చించినట్టు లెక్క. ఒకటి రెండు పాటలు, అక్కడక్కడ చూపించిన రాయలసీమ సాంప్రదాయాలు బావున్నాయి. మిగతా పాటలు లేకపోయినా ఈ సినిమాకు వచ్చిన నష్టం లేనప్పటికీ అవి ఉండడం సినిమాను ఫ్యాక్షన్ కు దూరంగా(!) తీసుకెళ్లడంలో పనికి వచ్చాయి.
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వి పూర్తిగా రాయలసీమ మాండలికం,యాసలో ఉన్న డైలాగులు! ఈ విషయంలో త్రివిక్రమ్ ని మెచ్చుకోవాలి. మొదటిసారి త్రివిక్రమ్ మార్కు డైలాగులు ఈ సినిమాలో కొంత కొత్త రూపాన్ని ంతరించుకోవడం విశేషం! అక్కడే సినిమా ఎక్కువ మార్కులు కొట్టేసింది! “పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం రాదా?” లాంటి డైలాగులు సినిమాకు కొంత ఊపుని ఇచ్చాయి. ‘నీ ధూమ్ తగల, మట్టి కొట్టుకుని పోతావు” లాంటి డైలాగులు రాయలసీమ నేటివిటీని ఇచ్చాయి.
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ట్రిం చేసి ఉంటే బాగుండును అని పించడం సహజం. కొన్ని సన్నివేశాలు లాగ డం వల్ల ఫ్యాక్షన్ నుంచి పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది. అరవింద, రాఘవ రెడ్డి ల ప్రేమ కొంచెం కొత్త రకంగా చిత్రీకరించిన ప్పటికీ ఎక్కువైనట్లు అనిపిస్తుంది.
మొత్తం మీద ఫ్యాన్స్ ని, ఫ్యాక్షన్ ను అసహ్యించుకునే వాళ్ళని కొంతవరకు సంతృప్తి పరిచిన సినిమా తీయడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయినట్లే!