ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లకు ఒక కొత్త సమస్య ఎదురువుతూ ఉందని రాష్ట ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐ వై ఆర్ కృష్ణారావు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నుంచి ఈ బెడద వస్తున్నదని ఆయన చెబుతున్నారు. రా ష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక సర్వే చేస్తున్నదని , అందులో ప్రభుత్వం నియమించిన వ్యక్తులు ఓటర్లకు ఫోన్ చేసి చంద్రబాబు ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నార లేరా అని అడుగుతున్నారని , దీన్నుంచే ఈ ప్రమాదం ఎదురవుతున్నదని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అసంతృప్తిగా ఉన్నమని చెప్పే వారి ఓట్లను జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి సమాధానాలు ఇచ్చేవారు తమ ఓటు ఉందా గల్లంతయిందా అనే విషయాన్ని అపుడపుడు చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైైరయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనని రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఛెయిర్మన్ ను చేశారు. అయితే ఆయన పనితీరుసరిగ్గాలేదని ఆ పదవి నుంచి తొలగించారు. దీనితో వారిద్దరి మధ్య వైరం మొదలయింది. అప్పటి నుంచి ఆయన చంద్రబాబు నాయుడికి వ్యతిుేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. మొదట్లో ఆయన ఇంక వైసిపిలో చేరతారనుకున్నారు. అయితే, ఈ మధ్య కృష్ణారావు బిజెపిలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినపుడు ఆయన పార్టీలో చేరి , బిజెపి కండువా స్వీకరించారు.
ఈ నేపథ్యంలో ఆయన చేసిన తొలి ఆరోపణ ఇది. రాష్ట ప్రభుత్వం ఈ మధ్య ప్రభుత్వం మీద ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు ప్రభుత్వం మొత్తం సర్వేలతోనే నడుస్తూ ఉంది. అయితే, సర్వే వెనక అసంతృప్తిగా ఉన్న ఓటర్లను తొలగించే కుట్ర ఉందా…