తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటర్ల జాబితాలో లోపాలున్నాయని హైకోర్టు చెప్పడంతో తుది తీర్పు తర్వాత ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.ప్రధాన ఎన్నిలక కమిషన్ ఒపి రావత్ ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.
ఎన్నికల కమిషన్ ప్రటించిన షెడ్యూల్ ఇది.
నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్
డిసెంబర్ 7 న తెలంగాణ ఎన్నికలు
డిసెంబర్ 11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు
ఒకే దశలో తెలంగాణ ఎన్నికలు.
అక్టోబర్ 12 న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. హైకోర్టు తీర్పు తర్వాతనే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఈసీ ఓపీ రావత్ తెలిపారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు డిసెంబర్ 15 లోగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రావత్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తామని రావత్ అన్నారు. నాలుగు రాష్ట్రాలకు వీవీ ప్యాట్ లు, ఈవీఎంలు సిద్దం చేశామన్నారు.
అక్టోబర్ 16న ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 12 న ఛత్తీస్ ఘడ్ మొదటి విడత ఎన్నికలు, నవంబర్ 20న రెండో విడత ఎన్నికలు ఉంటాయి.
మధ్యప్రదేశ్ లో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
మిజోరాంలో నవంబర్ 28న అసెంబ్లీ ఎన్నికలుంటాయి.
డిసెంబర్ 7న రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు
నవంబర్ 12న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ , డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది.
ఒకే దశలో తెలంగాణ ఎన్నికలుంటాయి.
డిసెంబర్ 11 న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఛత్తీస్ ఘడ్, మిజోరాం, మధ్య ప్రదేశ్ ల ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ రోజు విడుదలయింది. రాజస్థాన్ కు తెలంగాణకు ఒకే సారి ఎన్నికలు జరగుతున్నాయి.
ఛత్తీస్ ఘర్ మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:
18 అసెంబ్లీ నియోజకవర్గాలు
నోటిఫికేషన్ : అక్టోబర్ 16
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: 23 అక్టోబర్
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24
ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 26
పోలింగ్: నవంబర్ 12
ఛత్తీస్ ఘర్ రెండో దశ ఎన్నికల షెడ్యూల్:
72 అసెంబ్లీ నియోజకవర్గాలు
నోటిఫికేషన్ : అక్టోబర్ 26
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 2
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 5
పోలింగ్: నవంబర్ 20
మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ : నవంబర్ 2
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 9
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 12
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 14
పోలింగ్: నవంబర్ 28
రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ : నవంబర్ 12
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 19
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 20
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 22
పోలింగ్: డిసెంబర్ 7
కౌంటింగ్: డిసెంబర్ 11