తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ పర్యటనపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కొండమీద అమ్మోరు.. కొండ కింద కమ్మోరుని ప్రసన్నం చేసుకోవడానికే కేసీఆర్ విజయవాడ వెళుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మతల్లి, ఊరూరా పోచమ్మ తల్లులున్నారని.. ఇక్కడ ఎవరికీ ఏమీ చేయించని సీఎం.. విజయవాడకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.
అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయించిన రీతిగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారన్నారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని ముక్కుపుడక ఇవాళే ఎందుకు గుర్తుకు వచ్చిందన్నారు. బెజవాడకు ఆర్భాటంగా వెళుతున్నది… ముందస్తు ఎన్నికలు వస్తున్న సందర్భంగా మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇదంతా కమ్మవాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్నదిగా రేవంత్ సూత్రీకరించారు. కేసీఆర్ పర్యటనతో తెలంగాణకు ఉపయోగం లేదన్నారు.
కేసిఆర్ బెజవాడ టూర్ గుట్టు విప్పిన రేవంత్ (వీడియో)