అమరావతిలో, ఎసి గదిలో హైసెక్యూరిటీ కాపలాలో నరమానవులెరూ పైరవీ లేకుండా ప్రవేశించలేని సెక్రెటేరియట్ కూర్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అదేమిటంటే…
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల వంటి సేవలను పొందేందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగికీ నయాపైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణ మనిషిగా ఏదయినా గవర్నమెంటాఫీసుకు వెళ్లిఉంటే అక్కడ ఏమిజరుగుతుందో తెలిసేది. ఆయన మెరుపు తనిఖీలు, ఉపన్యాసాల వల్ల లంచం సంస్కృతి మటుమాయం కాదు.ఇలాంటి ప్రకటనల వల్ల ఏమీ జరగదు. దానినిఅమలు చేసే యంత్రాంగం రాష్ట్రంలో ఉండాలి.అలాంటేదేమీ లేకుండా విష రాజకీయ సంస్కృతి, అవినీతి లో ‘A’ ర్యాంకు కొట్టేస్తున్న ఆంధ్రలో ఇలాంటి ప్రకటన చేస్తే నవ్వుతెప్పిస్తుంది.
తన ప్రకటనని ముఖ్యమంత్రి ట్విట్టర్ కూడా పెట్టి నలుగురికి తెలిసే చేశారు, ఆయన ప్రకటనకుభయపడి తాలూకాపీసునుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు దాకా అధికారులు లంచం,పైరవీలు లేకుండా ఏవయిన పేదవాళ్ల పనులు జరిగివుంటే, ఆ అద్భుతానుభవం రాసి పంపిస్తే ప్రచురిస్తాం. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్. దేశంలో మోస్టు కరప్ట్ రాష్ట్రాలలో ఆంధ్రులు మొదట ఉన్నారు. కరప్షన్ పోయినపుడే ఆంధ్రప్రదేశ్ హ్యాపినెస్ ఇండెక్స్ పెరుగుతుంది. అధికారులు ఇచ్చే అంకెళ్లో కాదు రాష్ట్రం ఆనంద ఆంధ్రప్రదేశ్ లాాగే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎపుడూ గొప్పగా చెప్పుకునే జిడిపికి హ్యాపినెస్ ఇండెక్స్ కిసంబంధం లేదు. ఏమయిన సరే, ముఖ్యమంత్రి ప్రకటన భూ కంపం సృష్టించి తాలూకాఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల నుంచి లంచం నిర్మూలిస్తే అంతకంటే ఏంకావాలి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాల వంటి సేవలను పొందేందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగికీ నయాపైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.https://t.co/8qaXANgfyq
— N Chandrababu Naidu (@ncbn) 28 June 2018