మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘1971 బియాండ్ బార్డర్స్’. 1971లో భారత్`పాక్ సరిహద్దుల్లో జరిగిన వార్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. మేజర్ రవి దర్వకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ‘యుద్ధభూమి’ పేరుతో ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న 400కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏయన్ బాలాజీ మాట్లాడుతూ…‘‘1971 లో భారత్ -పాక్ బార్డర్ లో జరిగే వార్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా సినిమా రూపొందింది. మేజర్ మహదేవన్‌గా మోహన్‌లాల్ గారు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. అలాగే టాలీవుడ్ యంగ్ యాక్టర్ అల్లు శిరీష్ కీలక పాత్రలో నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మయాళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘యుద్ధభూమి’ పేరుతో తెలుగు లో ఈ నె 29న విడులద చేస్తున్నాం. ఈ చిత్ర దర్శకుడైన మేజర్ రవిగారు నిజ జీవితంలో కూడా మేజర్ కావడం విశేషం. ఈయన 1981లో ఆర్మీలో చేరి అనేక కీలక ఆపరేషన్స్ ని లీడ్ చేసారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆర్మీగా సేవలందించిన మేజర్ రవి సినిమా మీద ఆసక్తితో ప్రియదర్శిన్, రాజ్‌కుమార్ సంతోషి, కమల్‌హాసన్, మణిరత్నం వంటి దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో పని చేశారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో, వారి ఇన్స్పిరేషన్తో మేజర్ రవి మొదటిసారిగా మెగాఫోన్ పట్టి మోహన్‌లాల్ హీరోగా యుద్ధ నేపథ్యంలో ‘ కీర్తి చక్ర’ చిత్రానికి దర్వకత్వం వహించారు. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత వరుసగా యుద్ధ నేపథ్యంలో మోహన్‌లాల్‌తో మూడు సినిమా లు డైరక్ట్ చేశారు మేజర్ రవి. ఈ ‘1971 బియాండ్ బార్డర్స్’ ఐదో చిత్రం. మోహన్‌లాల్‌గారు, మేజర్ రవి కలయికలో వచ్చిన ఐదు చిత్రా లు సూపర్ హిట్ చిత్రా లుగా నిలిచాయి. మలయాళంలో టాప్ దర్శకుల్లో ఒకరిగా చేరిన మేజర్ రవితో స్టార్ హీరో లు సైతం సినిమా లు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్ హీరో లు కూడా తనతో పని చేయాలన్న ఆసక్తిని కనబరచడం విశేషం. ఈ ‘యుద్ధభూమి’ చిత్రానికి మేము అనుకున్న దానికన్నా హ్యూజ్ బిజినెస్ జరగడంతో హ్యాపీగా ఉన్నాం. ఈ నె 29 గ్రాండ్‌గా 400 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ విపిన్, డైలాగ్స్: ఎమ్ రాజశేఖర్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్.