తెలుగుదేశం ప్రతినిధి కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధాని ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధానిని కలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపిలంతా కలుస్తారని అనుకున్నా, ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సూచన మేరకు మంత్రిమాత్రమే వెళ్లారు. రాష్ట్ర డిమాండ్ల మీద సమాచారం అందించేందుకు ఎవరైనా ఒకరు ప్రధానిని కలుసుకోవచ్చని ప్రధాని కార్యాలయం నుంచ వర్తమానం వచ్చింది. దీనితో ముఖ్యమంత్రి సూచన మేరకు సుజనా చౌదరి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. అన్ని సమస్యలను వివరించి వచ్చారు. ఇది ఇలా ఉంటే, మరొక వైపు సభలో కూడా ఎంపిలు నినాదలు చేశారు. లోక్ సభలో వెల్ లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. ఆంధ్ర ప్రదేవ్ రిఆర్గనేజేషన్ యాక్ట్ ను అమలుచేయాలని వారు సభలో నినాదాలు చేశారు. పోతే, ఎంపి శివప్రసాద్ నారదుడి గెటల్ నిరసనకు హాజరయ్యారు.
అయితే, ప్రధాని నుంచి ఎలాంటి స్పష్టమయిన హామీ రాలేదని తెలిసింది. అయితే, తనకు ఆంధ్రప్రదేశ్ చాల ముఖ్య మయిన రాష్ట్రమని, రాష్ట్రానికి అన్నివిధాల సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అస్పష్టంగా చెప్పి, సుజనా చౌదరిని పంపించి వేశారని తెలిసింది.