ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజీనామా చేయాలనుకుంటున్న సమాచారం. తన అనుంగ అనుచరుడు బొడ్డు పల్లి హత్యతో ఆయన చాలా రోజులుగా కుమిలిపోతున్నారు. ఈ హత్యారాజకీయాలకునిరనన ప్రజలను సమీక రించేందుకు ఆయన నల్గొండ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనుకుంటున్న విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు, బొడ్డు పల్లి శ్రీనివాస్ కుటుంబానికి ఒక ఎమ్మెల్యే సీటు ఇప్పించి గెలిపించి తీరుతానని ఆయన ప్రతిజ్ఞ కూడా చేశారు. నల్గొండ సీటు బొడ్డుపల్లి కుటుంబానికి ఇచ్చి, తను మునుగోడు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.
అంతేకాదు, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా త్వరలో తెలంగాణ యాత్ర ప్రారంభించి అధికారపార్టీ ఆగడాలను వివరించి కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అధికారపార్టి నుంచి కాంట్రాక్టులు,మంచిహోదా వంటి ప్యాకేజీ ఉన్నా పట్టించుకోకుండా బొడ్డుపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ లో నే పనిచేస్తున్నారు. అంతే కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండలో ప్రతినిధిగా ఉంటూ వచ్చారు. శ్రీనివాస్ చూపిన విధేయతకు ప్రతిఫలం ఆయన ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు.ముఖ్యంగా తనను నమ్ముకున్నవారికోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ త్యాగానికైనా సిద్ధపడతారనే మెసేజ్ పంపించి జిల్లాలో తమపట్టు కొనసాగించేందుకు వారు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలుచెబుతున్నాయి.
మరి మునుగోడు సీటు వెంకటరెడ్డికి దక్కుతుందా? ఎందుకంటే, ఈ టికెట్ కోసం స్వర్గీయ ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూతరు స్రవంతి రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు.