కర్నాటకలో రాజకీయ భూకంపం….

కర్నాటకలో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి కుమార స్వామి            ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల్లోకి నెడుతూ  11 మంది శాసన సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఇందులో కాంగ్రెస్ , జెడిఎస్ సభ్యులున్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నపుడు ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఈ సంఖ్య ఇంకాపెరగవచ్చని అనుకుంటున్నారు.వీళ్లంతా ఏకంగా ఎమ్మెల్యన పదవికే రాజీనామా చేయడంతో, సభలో బిజెపికి స్పష్టమయిన మెజారిటి లభిస్తుంది. ఫలితంగా కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తమకు అవకాశం కల్పించాలని బిజెపి గవర్నర్ ను కోరవచ్చు.
శాసన సభ్యులు రాజీనామా పత్రాలను స్వీకర్ కెఆర్ రమేష్ కార్యాలయానికి అందిందిచారు.
వాళ్లంతా రాజీనామా పత్రాలను తన సెక్రెటరీకిఅందించారని స్పీకర్ రమేష్ కుమార్ తెలిపారు. 11 మందిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి రామలింగేశ్వరరెడ్డి , రమేష్ జర్కిహోలి, ప్రతాపగౌడ పాటటిల్, శివరామ్ హెబ్బార్, మహేశ్ కుమాథల్లి (అంతా కాంగ్రెస్ ), హెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ, కె గోపాలయ్య (జనతాదళ్ ఎస్ )లు కూడా ఉన్నారు.
అయితే, రూల్ ప్రకారం వాళ్లస్వయంగా వచ్చి తనకు రాజీనామా పత్రాలను సమర్పించాలని స్పీకర్ అన్నారు.
కాంగ్రెస్ నుంచి ఏడు మంది శాసన సభ్యులు రాజీనామా చేశారని, తన కూతురు సౌమ్యారెడ్డి కూడా రాజీనామచేస్తుందని రామలింగారెడ్డి చెప్పారు.
సిఎల్ పి నాయకుడు సిద్ధరామయ్య ఇంకా ఈ పరిణామం మీద స్పదించలేదు. ఈ లోపు కుమార స్వామి రేపు అమెరికా నుంచి బెంగుళూరుకు తిరిగొస్తున్నారు. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు కూడా యూరోప్ యాత్రలో ఉన్నారు.
కర్నాటక ప్రభుత్వం చాలా రోజులుగా ప్రమాదం అంచునే నడుస్తూ ఉంది.కాంగ్రెస్ -జనతాదళ్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, బిజెపి కేంద్రంలో బలపడంతో అభ్రదత తీవ్రమయింది. రెండేళ్లకిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీ గా వచ్చింది.అయితే,ప్రభత్వం ఏర్పాటుచేయలేకపోవడం, కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసేందకు కాంగ్రెస్ సహకరించింది.