హరీష్ రావు బర్త్ డే… కానీ కొత్త డౌటనుమానం

తెలంగాణ పోరాట యోధుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం జూన్3వ తేదీ. తెలంగాణ లో కీలక నేత బర్త్ డే అంటే సంబరాలు ఎలా ఉంటాయో మనకు తెలియనిది కాదు. అందులోనూ లక్ష మెజార్టీతో గెలిచిన ప్రజా నాయకుడు హరీష్ పుట్టిన రోజు అంటే ఇంకా ఆర్భాటంగా జరుగుతాయి అనుకుంటాము.

కానీ అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఈసారి బర్త్ డే వేళ కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉండడం లేదు. కార్యకర్తలు, అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే రీతిలో హరీష్ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమ నేత హరీష్ తెలంగాణ ఏర్పాటు తేదీ జూన్ 2 మరుసటి రోజే జన్మించారు. ముందస్తు ఎన్నికలకు అటూ ఇటూగా హరీష్ రావును తెరాసలో నెగలనిస్తలేరన్న చర్చ ఉంది. అంతే కాదు ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. పార్టీలో ఆయన ఊసే లేకుండా చేస్తిన్నారని ఆయన అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల పాటు హరీష్ రావు కు ప్రగతిభవన్ లోకి కూడా ఎంట్రీ లేదన్న చర్చ ఉంది.

అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ ప్రగతి భవన్ లో కాలు పెట్టారు. ఆయన, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా కేసీఆర్ తో కలిశారు.
ఇక హరీష్ బర్త్ డే సోమవారం జరగనుంది. ఈ బర్త్ డే సమయంలో హరీష్ అజ్ఞాతంలోకి వెళ్లి పోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. హరీష్ ఇచ్చిన స్టేట్ మెంట్ కింద ఉంది చూడొచ్చు.

హరీష్ ఎటు పోతున్నట్లు ??
పుట్టిన రోజు పండుగ పూట హరీష్ అజ్ఞాతంలోకి ఎందుకు పోతున్నారో… ఎక్కడ పోతున్నారో ఎవరూ చెప్పడం లేదు. ఆయనకు అత్యంత సన్నిహితులు కూడా హరీష్ అన్న ఎటు పోతుండో.. తెలియదు అంటున్నారు. హైద్రాబాద్, సిద్దిపేట కాకుండా ఇంకా ఎటు పోతాడబ్బా అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. సిద్దిపేట ఇడిసిపెట్టి గంట ఉండలేని మనిషి పండుగ పూట ఎందుకు రహస్య ప్రదేశంలో తల దాచుకుంటున్నారో అర్థం కావడం లేదని సిద్దిపేటకు చెందిన ఒక నేత చెప్పారు. ఆయనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఏమో… అందుకే అందరికి దూరంగా ఉంటున్నడేమో అని సదరు సిద్దిపేట పట్టణ నేత అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్నారైలకు టచ్ లో హరీష్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తన బర్త్ డే సందర్భంగా హరీష్ అమెరికా ఎన్నారైలకు టచ్ లోకి వచ్చారు. ఫోన్ లో వారిని పలకరించారు. ఫోన్ లోనే సందేశాన్ని తెలిపారు.

అమెరికా బే ఏరియా లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టి ఆర్ ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ వారితో మాట్లాడారు.

ఎన్నారైలకు హరీష్ సందేశం…

నాటి తెలంగాణ ఉద్యమం లో..నేటి అభివృద్ధి లో టి ఆర్ ఎస్ పార్టీ లో ఎన్నారైలది కీలక పాత్ర అని.. అమెరికాలో కూడా వేడుకలు నిర్వహించి.మన ఖ్యాతిని చాటి చెపిన ఎన్నారై ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై లందరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నారైలు కుటుంబ సబ్యులతో కల్సి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బైరీ పూర్ణ , జొన్నలు ఉదయ్ , శివ ,రాము , జగన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *