ఈరోజు దాశరథి కృష్ణమాచార్య జయంతి

ఈరోజు జులై 22 దాశరథి కృష్ణమాచార్య జయంతి

దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ గా మలిచి నిజాం పాలన మీదికి  ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, “దాశరధి” గా ప్రసిద్ధుడు.  పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన కవి దాశరథి . నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతెత్తి…

ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్నుబోలినరాజు మాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని ఎలుగెత్తి సభలలో వినిపించాడు .

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. విశిష్టాద్వైత స్థాపనకు శ్రీమద్రామానుజుల శిష్యుల్లో ఒకరైన దాశరథి పూర్వీకులు పూర్వం కాశ్వీర్థం భద్రాచలంలో స్థిరపడ్డారు. అప్పుడు రామదాసుగా కీర్తించబడిన కంచెర్ల గోపన్న రామాలయం కట్టించింది వీరి ప్రోద్బలంతోనేనని పెద్దలు చెప్తుంటారు. గోపన్న దాశరథీ శతకం వ్రాయడమే ఇందుకు నిదర్శనమంటుంటారు. దాశరథి తాతగారు, తండ్రి గారు మహాపండితులు.తల్లి సంస్కృతాంధ్రభాషల్లో విదుషీమణి ఆయన తండ్రి నుంచి సంస్కృతం, తల్లి నుంచి పోతన భాగవతం నేర్చుకున్నారు.

కౌశవర్యశాస్త్రీ అనే గొప్ప ఆధ్యాత్మిక వేత్త దగ్గర వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. 14, 15 ఏండ్ల వయసులో 25 పద్యాలు అశువుగా చెప్పినారు. స్కూల్లో అప్పటి సుబేదార్‌ నారాయణరావు అనే ఆయన మాట్లాడుతూ ”నీవు తప్పకుండా ఒక రోజు ఒక గొప్ప కవితా చక్రవర్తివవుతావు” అని అన్నారు.

సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు,
”గోదావరి గట్టుంది … గట్టుపైన చెట్టుంది. చెట్టుపైన పిట్టుంది. పిట్ట మనస్సులో ఏ ముంది … .. … ..” అని, ”బుడగ వంటి బతుకు … … ఒక చిటికెలోనే చితుకు … ఇది శాశ్వతమని తలచేవురా ఓ నరుడా” అంటూ
సినిమా పాటలుకవితలు రాసాడు.

నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి …. అంటు తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి ,వారిని జాగృతం చేసిన ప్రళయకవితామూర్తి.

1987 నవంబర్ 5 న దాశరథి తుది శ్వాస విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *