చిచ్చురేపిన టిటిడి నిర్ణయం, ‘హిందూయేతరుల డిక్లరేషన్ తొలిగించడం తప్పు’

టీటీడీ “చైర్మన్” పదవిని సైతం ఇతర మతాల వారికి ఇవ్వచ్చు అని ధర్మకర్తల మండలిలో తీర్మానం చేస్తారా?

టిటిడి ధర్మకర్తల మండలి హిందూయేతరులు తిరుమల ఆలయానికి వచ్చేందుకు డిక్లరేషన్  ఇవ్వ నవసరంలేదని నిర్ణయించడానికి వ్యతిరేకత మొదలయింది.  పార్టీలే కాకుండా యాక్టివిస్టులు కూడా ఈ నిర్నయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి కాంగ్రెస్ నాయకులు, యాక్టివిస్టు  నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ నిర్ణయం మీద ఆయన వ్యాఖ్యలు:

1)  తిరుమలకు వచ్చే ఏ మతస్థులకైనా డిక్లరేషన్ అవసరం లేదు అని ధర్మకర్తల మండలి చైర్మన్ పత్రికా ముఖంగా ప్రకటించడం అసందర్భం!!
2) టీటీడీ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న డిక్లరేషన్ సాంప్రదాయానికి మంగళం పాడే హక్కు ఎవరికీ లేదు!!
3) టీటీడీ “చైర్మన్” పదవిని సైతం ఇతర మతాల వారికి ఇవ్వచ్చు అని ధర్మకర్తల మండలిలో తీర్మానం చేస్తారా??
4) టీటీడీ చైర్మన్ ప్రకటనను ఆలయ పెద్ద జీయర్,చిన్న జీయర్ స్వామి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు టీటీడీ ఐఏఎస్ అధికారులు సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? బహిరంగ ప్రకటన చేయండి!!
5) తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఇతర మతస్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నట్లయితే డిక్లరేషన్ లో సంతకం చేయడం చేయకపోవడం వారి విజ్ఞతకు నిదర్శనం!
6) రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఇతర మతస్తులు డిక్లరేషన్ లో సంతకం చేసి పది మందికి ఆదర్శంగా నిలవాలి!
7) ఏపీ సీఎం హోదాలో అలాగే అంతకుముందు సైతం డిక్లరేషన్ లో సంతకం చేయకుండా ఆలయంలోకి వెళ్లడం జరిగింది!!
8) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏపీ సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సందర్భంగా డిక్లరేషన్ లో సంతకం చేయరన్న ముందస్తు ఆలోచనతో ధర్మకర్తల మండలి ఏ మతస్థులకి డిక్లరేషన్ అవసరం లేదు అన్న ప్రస్తావన తీసుకురావడం భక్తులు గమనిస్తున్నారు!
9) టీటీడీ ధర్మకర్తల మండలి ఒకవేళ తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అది తప్పు అని చెప్పాల్సిన ఐఏఎస్ అధికారులు ఎందుకు మౌనంగా సమర్ధిస్తున్నారు!!
10) తిరుమల కొండకు అపార అనుభవంతో మూడవసారి వచ్చిన అధికారి వాస్తవాలను ఆలయ సంప్రదాయాలను ధర్మకర్తల మండలికి ఎందుకు చెప్పడంలేదు!!
11) భారతదేశంలో ఉన్న అన్నీ మతాలవారు వారి సంప్రదాయాల ప్రకారం శుభకార్యాలు చేసుకుంటూ ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటున్నారు!!
12) ఏపీ సీఎం మెప్పుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి ఐఏఎస్ అధికారుల తొందరపాటు ప్రకటనల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినడం ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది
13. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల సందర్భంగా టీటీడీ చైర్మన్ ఐఏఎస్ అధికారుల తొందరపాటు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వానికి “గోరుచుట్టు పై రోకలిపోటుగా” మారుతుంది!!